పల్నాడు
న్యూస్‌రీల్
వీఐపీలకు టికెట్..?
హనుమాన్ చాలీసా పారాయణం
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026
సమన్వయంతో సక్సెస్ చేద్దాం
యువర్ అటెన్షన్ ప్లీజ్..
కోటప్పకొండ తిరునాళ్లపై
సమీక్షా సమావేశం
పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా,
ఎస్పీ కృష్ణారావు,
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
వీఐపీ పాస్‌లపై సమావేశంలో చర్చ
వీఐపీ దర్శనానికి టికెట్
పెట్టాలని నిర్ణయం
దేవదాయ శాఖ కమిషనర్‌కు
ప్రతిపాదన
వీఐపీ పాస్‌లతో ఆలయ ఆదాయానికి నష్టం కలుగుతుందని ట్రస్టీ రామకృష్ణ కొండలరావు తెలిపారు. గత ఏడాది 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆదాయానికి గండి పండిందన్నారు. ప్రతి ఒక్కరు వీఐపీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి టికెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనను దేవదాయ కమిషనర్‌కు పంపినట్టు పేర్కొన్నారు. వారి నుంచి నిర్ణయం వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఫిరంగిపురం: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామికి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లను ప్రభుత్వ శాఖల అధికారులు సమన్యయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో జరిగే తిరునాళ్ల మహోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్‌వో మురళీ, డీఎఫ్‌ఓ కృష్ణప్రియ, ట్రైనీ ఎస్పీ నిరంజన్, ఆలయ ధర్మకర్త రామకృష్ణ కొండలరావులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పారిశుధ్యం, తాగునీరు పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది తలెత్తిన స్వల్ప ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పార్కింగ్, స్నాన ఘాట్‌లు, బస్‌డిపోల వద్ద లైటింగ్ పెంచాలని సూచించారు. కొండ వ్యూ మ్యాప్‌ను పలు కూడళ్లలో ఏర్పాటు చేయడం ద్వారా తిరునాళ్లకు వచ్చే యాత్రికులకు ఉపకరిస్తుందని తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కేవలం తిరునాళ్ల సమయంలోనే కాకుండా ప్రతి నెల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌కు సూచించారు. అధికారుల పర్యవేక్షణ ఉంటేనే సిబ్బంది పనితీరు మెరుగపడుతుందని పేర్కొన్నారు. గత ఏడాది తిరునాళ్లలో చేసిన పనులకు బిల్లులు రాలేదని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించి తిరునాళ్లను విజయవంతం చేయాలని కోరారు.
ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐదు క్యూలైన్‌ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. క్యూలైన్‌లో భక్తులకు అందజేసేందుకు వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. రెండు లక్షల అరిసెలు, లక్ష లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
తిరునాళ్లకు 560 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఆర్‌ఎం రంజిత తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఎంహెచ్‌వో రవి తెలిపారు.
కొండ దిగువున పారిశుధ్య పనులకు 10 జోన్‌లుగా విభజించి 245 మంది సిబ్బందిని నియమిస్తున్నట్టు డీపీవో తెలిపారు.
ఆర్‌డీవో మధులత, డీఎస్పీ హనుమంతురావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


