రేపు కోటప్పకొండకు డెప్యూటీ సీఎం రాక
నరసరావుపేట రూరల్: డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం కోటప్పకొండలో పర్యటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి మంగళవారం పర్యటించి పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రారంభోత్సవానికి సిద్ధమైన రోడ్డును పరిశీలించారు. అనంతరం అధికారులతో పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు పవన్ కల్యాణ్ చేరుకుని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారని తెలిపారు. మార్గంమధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. అనంతరం కొండ దిగువకు చేరుకుని కోటప్పకొండ నుంచి కొత్తపాలెం రోడ్డును ప్రారంభించి 11.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీఓ మధులత తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే


