ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి..
వినుకొండ: వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళ వారం పోలీస్ భద్రత నడుమ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. సోమవారం బస్‌డిపోలో జరిగిన ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో అప్రమత్తమైన పోలీసులు ఒక ఎస్సై సహా 8 మంది కానిస్టేబుళ్లు ఆర్టీసీ సిబ్బంది బస్సుల వద్ద బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికులు నిదానంగా బస్సులు ఎక్కాలని ప్రశాంతంగా ప్రయాణం చేయాలని సూచనలు జారీ చేశారు.
ఆర్టీసీ అధికారుల తీరుపై విమర్శలు...
ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేయకపోవడం, అలా గే బస్సులు సంఖ్య పెంచకపోవడం వల్లనే తొక్కిసలాటకు కారణమైందని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలే ఇరుకుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్ నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆవరణలో బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రయాణికులు అటు ఇటు వెళ్లేందుకు వీలు లేకుండా చేయడం కారంపూడి, మాచర్ల, బొల్లాపల్లి మండలాలకు వెళ్లే బస్సులు కూడా ఒకే వైపు ఫ్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయడం, పైనుంచి వచ్చే సర్వీసులు ఆపకుండా నేరుగా వెళ్లేందుకు మరొక పక్క ఏర్పాటు చేయడం వంటి గందరగోళ పరిస్థితులు సృష్టించడంతోనే ప్రయాణికులు ఎటువెళ్లాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు.
హయ్యర్ బస్సులన్నీ డిపోలోనే...
పండుగ వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ అధికారులు కనీసం జాగ్రత్తలు పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం పేరుతో ఉచిత ప్రయాణా లు కల్పించారు. కానీ కనీసం ఎక్కడా అదనపు సర్వీసులు నడపకపోవడం ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. దీనికి తోడు హయ్యర్ బస్సులన్నీ డిపోలోనే ఉండాలని ఆర్టీసీ డీఎం హుకుం జారీ చేయడంతో బస్సుల రద్దీ పెరిగిపోవడం బస్ డిపో ఆవరణ సరిపోకపోవడం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దీంతో విసుగు చెందిన ప్రయాణికు లు రైలు ప్రయాణానికి మొగ్గు చూపారు. ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు వినుకొండ రైల్వేస్టేషన్ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు అధికసంఖ్యలో రావడంతో రైలు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్లాట్‌ఫారాల కోసం ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించి గతంలో ఉన్న విధంగా ఏర్పాటు చేస్తే కొంత సౌకర్యంగా ఉంటుంది.
బస్టాండ్‌లో పోలీస్ బందోబస్తు
వినుకొండ ప్రయాణికులకు
ఉపశమనం కలిగించేలా
ఆర్టీసీ అధికారుల చర్యలు
తొక్కిసలాట ఘటనతో
అప్రమత్తమైన యంత్రాంగం
ప్రయాణికులు సులభంగా
బస్సులు ఎక్కేలా ఏర్పాట్లు
సంక్రాంతి పర్వదినానికి రద్దీ ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. తెలంగాణ ఆర్టీసీ 6400 బస్సులను నడిపితే, మన ఆర్టీసీ 200 బస్సులు మాత్రమే నడిపింది. దీంతో ప్రైవేటు బస్సుల్లో ఎక్కువగా రాకపోకలు సాగించారు. వేలాది మంది బస్టాండ్‌లో ఉన్నప్పటికీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం, అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే తోపులాట జరిగి ప్రమాదానికి దారి తీసింది. ఇప్పటికై నా స్పందించి సర్వీసులు పెంచాలి.
– ఎం.ఎన్.ప్రసాద్,
వైఎస్సార్ సీపీ ప్రధానకార్యదర్శి
ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి..
ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి..


