22 నుంచి విజ్ఞాన్‌లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026 ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ ను కూడా మూడు రోజుల పాటు ఇదే సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెట్రీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్‌ను ‘లివరేజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, స్కూల్, పాలిటెక్నిక్ విద్యార్థి బృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. విజేతలకు ప్రత్యేక ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్


