వీవీఐటీ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక సిమెన్స్ ఈడీఏ
పెదకాకాని: విద్యాలయాలలో అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణల రూపకల్పనతోపాటు పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి సిమెన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సిమెన్స్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమిషన్ సెంటర్ (సిమెన్స్ ఈడీఏ సెంటర్) ఏర్పాటుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఎంపికై నట్లు వీవీఐటీయూ ప్రొ–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీయూలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం సిమెన్స్ అకడమిక్ పార్టనర్ గ్రాంట్‌కు సమర్పించిన విద్యార్థుల ప్రాజెక్ట్ సమూనాలు, అధ్యాపకుల పరిశోధనల ఆధారంగా ఈ కేంద్రం ఎంపిక కాబడిందని బుధవారం ప్రొ ఛాన్సలర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు మూడు సంవత్సలకు కోటిన్నర విలువచేసే ఐసీ డిజైన్ అండ్ వెరిఫికేషన్, ఎంబడెడ్ సిస్టమ్స్, పీసీబీ డిజైన్స్ అనుబంధ ఈడీఏ సాధనాలను సిమెన్స్ సంస్థ అందించినట్లు వివరించారు. అనంతరం ఈిసీఈ విభాగాధిపతి, ఈడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వై. భానుమూర్తి, సైట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎస్.కె ఇనావుల్‌హక్ లను వీవీఐటీయూ చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి. అకడమిక్ డీన్ డాక్టర్ కె. గిరిబాబు అభినందించారు.


