వైఎస్సార్ సీపీలో పలువురి నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురు నాయకులను పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వినుకొండకు చెందిన జుజ్జూరి ఐరామమూర్తి, లీగల్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చిలకలూరిపేటకు చెందిన దాసరి చిట్టిబాబు నియమితులయ్యారు. అలాగే నరసరావుపేటకు చెందిన యాదల శ్రీనివాసరెడ్డిని పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగాను, యన్నం రజనీరెడ్డిని మహిళా విభాగం జిల్లా సెక్రటరీగా నియమించారు. అలాగే ఐటీ వింగ్ జిల్లా ఉపాధ్యక్షులుగా రవిశంకరరెడ్డి(సత్తెనపల్లి), బుర్రి రాజశేఖరరెడ్డి (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి (నరసరావుపేట), రజాక్ (చిలకలూరిపేట), ఆళ్ల నాసరరెడ్డి (వినుకొండ), గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి (పెదకూరపాడు), మద్దు బ్రహ్మయ్య (మాచర్ల)లను నియమించారు.


