నడిరోడ్డుపై నడిపించి కోర్టుకు..
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న గణపతి రాజేష్, అతని స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉమర్‌బుడేసాహెబ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఢీ కొనడడంతో వివాదం జరిగింది. దీనిపై కక్ష పెంచుకున్న గణపతిరాజేష్ అతని స్నేహితులతో కలిసి గతేడాది డిసెంబర్ 21న బుడేసాహెబ్ ఇంటికి వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బుడేసాహెబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇందిరాకాలనీకి చెందిన గణపతి రాజేష్ అలియాస్ శ్రీను, గణపతి ఆనంద్, బత్తుల హరీష్‌తో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కాగా రౌడీషీటర్ గణపతి రాజేష్ 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.


