హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Dec 8 2025 8:08 AM | Updated on Dec 8 2025 8:08 AM

హత్య

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ కోటప్పకొండలో వైభవంగా ఆరుద్రోత్సవం

వివాహేతర సంబంధం నేపథ్యంలో బాజీ హత్య

ఈనెల 24న ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్‌ సమీపంలో ఘటన

వివాహిత భర్త, తల్లులే నిందితులు

కేసు వివరాలు వెల్లడించిన రూరల్‌ సీఐ సుబ్బారావు

నరసరావుపేట రూరల్‌: సంచలనం సృష్టించిన షేక్‌ పెద్దబాజి హత్యకేసులో ఇద్దరు నిందితులను నరసరావుపేట రూరల్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నరసరావుపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రూరల్‌ సీఐ ఎంవి సుబ్బారావు కేసు వివరాలు వెల్లడించారు. టీ మాస్టర్‌గా పనిచేస్తున్న కొండలరావుపేటకు చెందిన పెద్ద బాజీకి వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సుబ్రహ్మణ్యచారి తన భార్యతో సంబంధాన్ని వదిలివేయాలని కోరాడు. బాజీ విన కుండా ఫోన్‌లు చేసి ఇబ్బంది పెట్టడంతోపాటు వివాహితను తీసుకెళ్లి దాచాడు. దీంతో బాజీపై కక్ష పెంచుకున్న సుబ్రహ్మణ్యచారి అతడిని హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకు తన అత్త రాంబాయమ్మ సహకారం కోరగా ఆమె అంగీకరించింది. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో చిలకలూరిపేట రోడ్డు ఎస్‌ఆర్‌కేటి జంక్షన్‌ సమీపంలో టీ స్టాల్‌కు వెళుతున్న బాజీపై కత్తితో దాడిచేసి హత్యచేశారు. తీవ్రంగా గాయపడిన బాజీని ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యలు నిర్ధారించినట్టు సీఐ తెలిపాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను వల్లప్పచెరువు వద్ద అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూరల్‌ ఎస్‌ఐలు కిషోర్‌, ఫాతిమాలు రెండు టీమ్‌లుగా ఏర్పడి కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్టు వివరించారు.

త్రికోటేశ్వరస్వామికి మహా రుద్రాభిషేకం

పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

కనీస సౌకర్యాలు కల్పించిన అధికారులు

క్యూలైన్‌లో పలుమార్లు తోపులాట

తీవ్ర ఇబ్బందులు పడిన భక్తులు

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాన్ని శనివా రం అర్ధరాత్రి నుంచి వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆరుద్రోత్సవంలో పాల్గొన్నారు. పాతకోటయ్య స్వామి ఆలయం వద్ద జ్యోతి వెలిగించి భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు. అనంతరం అర్ధరాత్రి 12గంటల నుంచి స్వామికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధం, కుంకుమ, తైలంతో నేత్రపర్వంగా అభిషేకాలు జరిపారు. చివరిగా అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామికి విశేష అలంకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తాళ్ల వెంకటరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్‌లు అన్నసంతర్పణకు సహకారం అందించారు.

– ఆరుద్రోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జ్యోతి దర్శనం అనంతరం స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. చిన్నారులతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు భక్తులు ఆలయ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసిన ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఒక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. దీంతో క్యూలైన్‌లో భక్తుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. ఆలయంలోకి భక్తులు రాకుండా తాళాలు వేయడంతో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ సైతం కొంతసేపు బయటనే వేచి ఉండాల్సి వచ్చింది. పవిత్రమైన ఆరుద్రోత్సవం రోజున ఆలయానికి విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేస్తారు. గాలిగోపురాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఈ ఏడాది అటువంటి ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు విమర్శలు వ్యక్తం చేశారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ 
1
1/3

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ 
2
2/3

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ 
3
3/3

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement