ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా పసుపులేటి
చేబ్రోలు: ఏపీ రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా చేబ్రోలు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావును నియమిస్తూ ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. చేబ్రోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న పసుపులేటి శ్రీనివాసరావు గతంలో కాంగ్రెస్ పార్టీ మండల, నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆదేశాలు, సూచనల ప్రకారం అందరి సహకారంతో పనిచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులైన పసుపులేటిని పలువురు అభినందించారు.


