పక్షపాతంపై నిరసన గళం
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌లో కొనసాగుతున్న వ్యవహారాలను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ, జెడ్పీ యంత్రాంగం ఏకపక్ష వైఖరిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు బహిష్కరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ మొత్తం ఆరు సమావేశాలకుగానూ మూడు స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా తయారు చేసిన అజెండాలను తిరస్కరించారు.


