గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ కీర్తికి కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు, డీన్ డాక్టర్ సి.హెచ్.మోహన్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు.


