అమరేశ్వరాలయంలో విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరాలయంలో విశేష పూజలు

Nov 27 2025 6:25 AM | Updated on Nov 27 2025 6:25 AM

అమరేశ

అమరేశ్వరాలయంలో విశేష పూజలు

అమరేశ్వరాలయంలో విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యషష్టి సందర్భంగా దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం వేకువజామున స్వామి వారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజశేఖరశర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి పదకొండు గంటల వరకు అర్చకులు అభిషేకాలు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్వేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరుడిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యేక పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎన్‌ఎంలకు వైద్య విధులే కేటాయించాలి గుంటూరు మెడికల్‌: సచివాలయ ఏఎన్‌ఎంలకు వైద్య విధులతోపాటు పంచాయతీ సంబంధిత పనులు కూడా అప్పగించడంతో వారు సతమతం అవుతున్నారని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు బి.నాగవర్ధన్‌ తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ ఏఎన్‌ఎంలను వైద్య ఆరోగ్యశాఖకు చెందిన విధులు మాత్రమే నిర్వహించేలా చూడాలని డీఎంహెచ్‌ఓను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.కిరణ్‌, జిల్లా, సిటీ నేతలు ఎండీ షరీఫ్‌, నరేంద్ర బాబు, నరసింహారావు, వెంకట్‌ తదితరులు ఉన్నారు. జిల్లా కోర్టులో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల కోలాహలం వైదిక మార్గంతోనే లోకహితం

గుంటూరు లీగల్‌ : ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్‌ మెంబర్‌గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్‌ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు.

తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్‌ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్‌, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

అమరేశ్వరాలయంలో  విశేష పూజలు 1
1/2

అమరేశ్వరాలయంలో విశేష పూజలు

అమరేశ్వరాలయంలో  విశేష పూజలు 2
2/2

అమరేశ్వరాలయంలో విశేష పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement