పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 27 2025 6:25 AM | Updated on Nov 27 2025 6:27 AM

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 ధర పలకడంతో రైతుల ఆసక్తి

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

పులిచింతల సమాచారం

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

పత్తి, మిర్చి పంటల నష్టాలతో

మొక్కజొన్న వైపు మళ్లిన రైతులు

ఏలూరు ప్రాంతానికి దీటుగా

పల్నాడు వైపు కంపెనీల చూపు

రబీ సీజన్‌లో భారీగా పెరిగిన

మొక్కజొన్న సాగు

దుర్గి: అక్టోబర్‌ నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు విత్తనాలు నాటేందుకు సీజన్‌ అనుకూలంగా ఉంది. గత నెల రోజులకుపైగా సాధారణ మొక్కజొన్న 27,067 ఎకరాలు, విత్తనోత్పత్తి మొక్కజొన్న కలిపితే సుమారు 50 వేల ఎకరాలకుపైగా జిల్లాలో సాగు చేశారు. ముఖ్యంగా మాచర్ల, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, బొల్లాపల్లి, సత్తెనపల్లి, గురజాల తదితర ప్రాంతాలలో సుమారుగా 27 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

పత్తి, మిర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటంతో విత్తనోత్పత్తి మొక్కజొన్నకు కంపెనీలు ముందుగానే ఒక ధరను నిర్ణయించి పంటను కొనుగోలు చేయటంతో రైతులు పంటను సాగు చేస్తున్నారు. పెట్టుబడి, చీడపీడల నష్టం తక్కువగా ఉండటంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. వివిధ కంపెనీలు వైరెటీని బట్టి క్వింటాకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ధరలు నిర్ణయించారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వటంతో పాటు పలు తెగులు, పురుగు, గడ్డి మందులనూ వారే అందిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటను పలు కంపెనీలు హైదరాబాద్‌, ఏలూరుకు తీసుకెళ్లి విత్తనశుద్ధి చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దుర్గి పరిసర ప్రాంతాలలో పలు కంపెనీలు స్థానికంగా మొక్కజొన్న డ్రయర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

జెడ్పీలో పనులన్నీ మీరే

కేటాయించుకుంటే ఇక

ప్రజాప్రతినిధులుగా మేమెందుకు?

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను

బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

రాజ్యాంగ దినోత్సవం

రోజు జెడ్పీటీసీలకు అవమానం

ప్రణాళిక–ఆర్థిక, పనుల

ఆమోదానికి సంబంధించిన

కమిటీలు బహిష్కరణ

తమ మండలాలకు పనులు

కేటాయించలేదని మండిపాటు

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న

చైర్‌పర్సన్‌ వైఖరిపై ఆగ్రహం

ప్రభుత్వం నుంచి నిధులు

తెచ్చుకోలేని పరిస్థితుల్లో చైర్‌పర్సన్‌

7

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.

పల్నాడు ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్న రైతాంగం కష్టనష్టాలను చవిచూసి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. రెండేళ్లుగా మొక్కజొన్న విత్తనోత్పత్తితో రైతులు లాభాలు పొందుతున్నారు.

పల్నాడు1
1/8

పల్నాడు

పల్నాడు2
2/8

పల్నాడు

పల్నాడు3
3/8

పల్నాడు

పల్నాడు4
4/8

పల్నాడు

పల్నాడు5
5/8

పల్నాడు

పల్నాడు6
6/8

పల్నాడు

పల్నాడు7
7/8

పల్నాడు

పల్నాడు8
8/8

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement