దెబ్బతిన్న పంటల పరిశీలన
ప్రత్తిపాడు: తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణబేగం ఆదివారం పరిశీలించారు. మోంథా తుపాను ప్రభావంతో ప్రత్తిపాడు పరిసర ప్రాంతంలోని వంగిపురం, పాతమల్లాయపాలెం, తిమ్మాపురం గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఆదివారం ‘సాక్షి’లో ‘పంటలు మునిగి బురద మిగిలి..!’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఏవో సుగణబేగం సిబ్బందితో కలిసి పాతమల్లాయపాలెం, వంగిపురం గ్రామాల్లో పర్యటించారు. పాతమల్లాయపాలెంలో పూర్తిగా మాడిపోయిన పత్తి పంటతో పాటు వంగిపురంలో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏవో తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతం కన్నా అధికంగా పంట దెబ్బతిన్న రైతులందరి వివరాలను నమోదు చేస్తున్నామని చెప్పారు. రెండు రోజులు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయనున్నారని చెప్పారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన


