శతాధిక వృద్ధుడు కోటిరెడ్డి మృతి
కారెంపూడి: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన అవుతు కోటిరెడ్డి(101) ఆదివారం మృతి చెందారు. కారెంపూడి మండలం లక్ష్మీపురం గ్రామం కోనసీమను తలపించే ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. కొల్లిపర మండలం మున్నంగి నుంచి వలస వచ్చిన కోటిరెడ్డి అన్నదమ్ములు మొదట గుడిసెలు వేసుకుని అంకురార్పణ చేశారు. సాగర్ కుడి కాల్వ రాకతో దాని బ్రాంచి కాలువ గ్రామం పక్కనే వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత దానిని గమనించిన ఆయన స్వగ్రామస్తులు ఉన్న ఊరిలో ఉన్న పొలం అమ్ముకుని ఇక్కడ పొలం కొనుక్కొని ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇలా గృహసముదాయాలు ఏర్పాటు కావడంతో దానికి కోటిరెడ్డి లక్ష్మీపురం అనే నామకరణం కూడా చేశారు. దానికి ఉత్తరంలో కాలగర్భంలో కలసిపోయిన వీరలక్ష్మీపురం అగ్రహారం పేరు కలిసి వచ్చేలా ఆయన నామకరణం చేశారు. పల్నాట నూతన గ్రామం నెలకొల్పడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా కోటిరెడ్డికి పేరుంది. పైగా శతాధిక వృద్ధుడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా, నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదివారం భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి సాయంత్రం బయలుదేరి బీసెంట్‌రోడ్డుకు వెళ్లి షాపింగ్ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ మీదుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో వినాయకుని గుడి సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరారు. ఆ సమయంలో రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న గవర్నర్‌పేటకు డిపోకు చెందిన సిటీ ఆర్డినరీ బస్సు ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కింద పడిపోయారు. అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిరంగిపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్ అసదుల్లా(52) కొండరాయి పనిచేస్తుంటాడు. పని మీద ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెట్రోలు బంకు సమీపంలో రోడ్డు పక్కన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అసదుల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ శివరామకృష్ణ , ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య షేక్ అస్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శతాధిక వృద్ధుడు కోటిరెడ్డి మృతి
శతాధిక వృద్ధుడు కోటిరెడ్డి మృతి


