జిల్లా సిమ్మింగ్ జట్లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ ఫూల్‌లో ఆదివారం నిర్వహించారు. వివిధ విభాగాలకు జరిగిన ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి 58 మంది స్విమ్మర్లు హాజరయ్యారు. వీరిలో 28 మంది జిల్లా జట్లుకు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సబ్ జూనియర్ విభాగానికి ఎంపికై న 10 మంది ఈనెల 16వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ విభాగానికి ఎంపికై న 15 మంది ఈనెల 22, 23 తేదీల్లో విశాఖలో జరగనున్న రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లోనూ, మాస్టర్స్ క్యాటగిరీకి ఎంపికై న ముగ్గురు నవంబర్ 9వ తేదీన విజయవాడలో జరగనున్న పోటీల్లో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపిక పోటీలను కోచ్ జి.సురేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు అభినందించారు.
వివిధ కేటగిరీలలో 28మంది ఎంపిక


