ఎల్‌ఐసీ ఏంజెట్ల సమస్యలపై పోరాడిన స్టాలిన్‌బాబు
విజయపురిసౌత్: ఎల్‌ఐసీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(లియాఫీ) మాజీ నాయకులు బి.స్టాలిన్‌బాబు నిరంతరం పోరాటాలు చేశారని ఫెడరేషన్ ఆలిండియా జనరల్ సెక్రటరీ మార్కండేయులు పేర్కొన్నారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ ఈసీ సమావేశం ఆదివారం నాగార్జునసాగర్‌లో నిర్వహించారు. తొలుత దివంగత నాయకులు స్టాలిన్ బాబు, సోమయ్యలకు నివాళులర్పించారు. సభకు డివిజన్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, జోనల్ ప్రెసిడెంట్ కే. వేణుగోపాల్‌రెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ, రవీంద్రరెడ్డి, డివిజన్ జనరల్ కోశాధికారి జగన్నాధం, డివిజన్ రెసిడెన్సీ సెక్రటరీ, రఘు, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ రామచంద్రరావు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అలిమియా, డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుతి, గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ఈజె ప్రకాష్, గురజాల అధ్యక్షులు మునీశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏజెంట్లకు కమీషన్ తగ్గింపు విషయమై దేశావ్యాప్తంగా యూనియన్ పోరాటం చేసిన తీరును మార్కండేయులు వివరించారు. బ్రాంచిల్లో సిబ్బంది కొరత, వివిధ బ్రాంచ్‌ల్లో కొనసాగుతున్న నియంతృత్వ పోకడలను ఎదుర్కొవాలని పేర్కొన్నారు. గ్రాట్యూటీ పెంపు, గ్రూప్ ఇన్స్యూరెన్స్ పెంపు, స్థానిక బ్రాంచ్ సమస్యలు పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అన్నీ బ్రాంచ్ నాయకులు ఏజెంట్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వడ్లమూడి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.


