వైఎస్సార్ సీపీ కార్యకర్తలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
వినుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్ అన్నారు. ఇటీవల వివాహ వేడుకల్లో వైఎస్సార్ సీపీకి చెంది 11 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారన్నారు. చిన్నచిన్న సంఘటనలకు కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. శనివారం హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ జబ్బార్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తను పోలీసులు కొట్టి వదిలి పెట్టారన్నారు. బాధితుడిని పీఎస్ ఖాన్‌తోపాటు, పలువురు నేతలు జబ్బార్‌ను పరామర్శించి, పోలీసుల తీరుపట్ల నిరసన వ్యక్తం చేశారు.


