డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
రూ.10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌ను రాష్ట్రంలోనే మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, కార్పొరేట్ ఆసుపత్రులకంటే దీటుగా పేదలకు వైద్య సేవలు అందించేలా చూస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రూ.10 కోట్లతో అజీజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణ పనుల కోసం శనివారం ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకున్నారు. డెక్కన్ టుబాకో ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ తన తండ్రి అజీజ్ ఖాన్ పేరు మీదుగా భవనిర్మాణం చేపట్టేందుకు రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. ఈనేపథ్యంలో శనివారం షఫిక్‌ఖాన్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, భవన నిర్మాణ దాత, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ మాట్లాడారు. డీఎంఈ డాక్టర్ రఘునందన్, దాత షఫిక్‌ఖాన్‌లు భవన నిర్మాణ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, హెచ్‌డీఎస్ సభ్యులు, సీనియర్ ఐవీఎఫ్ స్పెషలిస్టు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ చిన్నం సుధారాణి పాల్గొన్నారు.
గురజాల: జాతీయ రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పదో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి ప్రియదర్శిని తెలిపారు. స్థానిక కోర్టు భవనాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు, విద్యుత్, వాహన ప్రమాద కేసులు సత్వరం పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయంతోపాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో ఒప్పంద పత్రాలు మార్చుకున్న అధికారులు
1/1
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్