హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 3న విద్యా కేంద్రం జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అండర్–19 హాకీ జిల్లా జట్ల ఎంపికలు క్రీడా మైదానం అనుకూలత లేనందున వాయిదా వేసినట్లు అండర్–19 ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జట్ల ఎంపిక ఈనెల 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
పెద్దింటమ్మతల్లి ఆలయంలో చోరీ
అమరావతి: అమరావతి గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి దేవాలయంలో పపూజల అనంతరం పూజారులు తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని అగంతకులు అమ్మవారి ఆలయం గేటుకు వేసి ఉన్న ఐదు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీకి ఉన్న రెండు తాళాలను పగులగొట్టి అందులోని సుమారు రూ.8వేల నగదును దొంగిలించారు. శనివారం ఉదయం ఆలయం తెరవటానికి వచ్చిన పూజారులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అచ్చయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక టీంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా


