సాఫ్ట్‌బాల్ ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ అండర్–14, అండర్ –17 బాల, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా జట్లను ఎంపిక చేశారు. అండర్ – 17 జట్టుకు ఎంపికై న బాల, బాలికలు ఈనెల 27వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారు. అండర్–14 జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికై న బాల, బాలికలు ఈ నెల 22వ తేదీ నుంచి కడప జిల్లా పులివెందులలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడా కారులు హాజరయ్యారన్నారు. ఎంపికల్లో పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేష్‌కుమార్, మాజీ సెక్రటరీ చిరంజీవి, ఏఎంజీ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, సాఫ్ట్‌బాల్ గేమ్స్ స్టేట్ కార్యదర్శి పి.నరసింహారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చినరామయ్య, పాఠశాల చైర్మన్ ఏడుకొండలుతోపాటు పలువురు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టుకు ఎంపికై న బాలురు, బాలికలు
సాఫ్ట్‌బాల్ ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక


