మెగా జాబ్‌మేళాను సద్వినియోగపర్చుకోవాలి
సత్తెనపల్లి: బ్రాహ్మణ నిరుద్యోగ యువత మెగా జాబ్‌మేళాను సద్వినియోగపర్చుకోవాలని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపవరపు రంగారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్‌శర్మ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువత కోసం డిసెంబర్ 13న గుంటూరు హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో భారీ స్థాయిలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను సత్తెనపల్లిలో శనివారం ఆవిష్కరించారు. రంగారావు మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన 50 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. బ్రాహ్మణ వంశీయులు తమ దరఖాస్తులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులకు ఎటువంటి ఎంట్రీ, రిజిస్ట్రేషన్ ఫీజు లేదన్నారు. తమ దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోపరాజు విజయరామారావు, కార్యదర్శి మాటేటి నాగరాజు, నాయకులు ధర్మవళం భుజంగరావు, గుళ్లపల్లి కృష్ణ, పిసపాటి హనుమంతరావు, సత్యా ధ్యాన మందిరం అధ్యక్షుడు సురావధానుల రాజ్యమోహనరావు, ఉన్నవ పూర్ణచంద్ర ప్రసాదరావు, కుమార వెంకటరమణ నాగరాజు, అర్చక సంఘ నాయకులు వేదాంతం రాజాభార్గవనాథ్, యు.రాజశేఖర్, గంగిరాజు రాము తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపవరపు రంగారావు


