అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి
నాదెండ్ల: ఫ్యాక్టరీల్లో జరిగే అగ్నిప్రమాదాలు, నివారణపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని బాపట్ల, పల్నాడు జిల్లాల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు చెప్పారు. గణపవరం గ్రామంలోని మద్ది లక్ష్మయ్య టుబాకో కంపెనీలో శనివారం ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫ్యాక్టరీలో ప్రతి షిప్టునకు 438 మంది కార్మికులు విధుల్లో ఉంటారని, ఎమర్జెన్సీ అలారం మోగిన సమయంలో అత్యవసర ద్వారాల ద్వారా కార్మికులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినపుడు స్పందించాల్సిన తీరు, మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు వాటిల్లిన సమయంలో మంటలను ఆర్పే పరికరాల వినియోగంపై కార్మికులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు, కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ బాబూరావు, జనరల్ మేనేజర్ స్వామి, ఫైనాన్స్ డైరెక్టర్ శేఖర్, సిబ్బంది ఉన్నారు.
డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
ఆర్ త్రినాథరావు


