టెయిల్‌పాండ్ ప్రాజెక్టును సందర్శించిన జెన్‌కో సీఈ
సత్రశాల(రెంటచింతల): నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టును శుక్రవారం ఏపీ జెన్‌కో సీఈ విశ్వేశ్వరరావు సందర్శించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఉదయం ప్రాజెక్టు రిజర్వాయర్‌ను, జల విద్యుత్ కేంద్రాన్ని, రేడియల్ క్రస్ట్‌గేట్లును స్థానిక జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ప్రాజెక్టుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసినందున విద్యుత్ ప్రాజెక్టులో ఉత్పత్తి గురించి, ఎన్ని రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి ఎన్ని వేల క్యూసెక్కులు వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేశారు, ఇటీవల కాలంలో ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు వచ్చాయా అని ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఈఈలు నాగరాజు, శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు ఇతర అధికారులు ఉన్నారు.


