పెళ్లి కుమారుడైన పాండురంగస్వామి
అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ రుక్మాభాయి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో పాంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారిని పెండ్లి కుమారుని చేసి అర్చకులు ధ్వజారోహణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు ఉత్పవాల గురించి వివరిస్తూ శనివారం చిన్న శేషవాహనం, ఆదివారం ఉదయం దధిమధనోత్సవం, గోపాల బాలోత్సవం, సోమవారం అశ్వవాహనంపై కల్యాణమూర్తులకు ఎదుర్కోల మహోత్సవం ఉంటాయన్నారు. అనంతరం రుక్మాభాయికి, స్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. మంగళవారం స్వామి వారికి లక్ష తులసి పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం వసంతతోత్సవం, చూర్ణోత్సవం, పూర్ణాహుతి ఉంటాయని తెలిపారు.


