అవినీతి రహిత సమాజానికి కృషి
మాచర్ల రూరల్: అవినీతి రహిత సమాజం నిర్మించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ డీజీఎం దివాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం విజిలెన్స్ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పవర్ గ్రిడ్ ఉద్యోగుల నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధిలో అవినీతి ప్రధాన ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


