మోంఽథా తుపానుతో రోడ్లు ధ్వంసం
నాదెండ్ల: మోంథా తుపాను కారణంగా గ్రామాల్లో లింకు రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. గణపవరం నుంచి కావూరు, లింగంగుంట్ల వెళ్లే డొంక రోడ్డుకు రెండు చోట్ల గండ్లు పడి కోసుకుపోయింది. వెంపలబాబాయ్ చెరువు సమీపంలో రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. మరికొద్ది దూరంలో భారీగా కోతకు గురైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మాత్రమే అతికష్టమ్మీద రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర భారీ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. పలుచోట్ల రోడ్డు పాక్షికంగా దెబ్బతినటంతో రాకపోకలు నరకప్రాయంగా మారాయి. అధికారులు స్పందించి మరమ్మతులు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నరసరావుపేట రూరల్: ఐకమత్యంగా ఉంటేనే బలంగా ఉంటామనే సందేశం అందించడమే ఐక్యత దినోత్సవ ఉద్దేశమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం పటేల్ చేసిన కృషి అపూర్వమైనదని తెలిపారు. దేశం సమైక్యంగా ఉన్నందునే అనేక యుద్ధాలు, ఆర్థిక సంక్షభాలు, ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొందని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(క్రైం) లక్ష్మీపతి, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కారెంపూడి: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎస్‌కే సైదావలి పశువులకు నీరు తాపడానికి మోటారు వేసిన సమయంలో వైరు తెగి మీద పడింది. దీంతో సైదావలి (50) అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సైదావలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మోంఽథా తుపానుతో రోడ్లు ధ్వంసం
మోంఽథా తుపానుతో రోడ్లు ధ్వంసం


