అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కృష్ణ
నెహ్రూనగర్: అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలిగా కాసు కృష్ణ చైతన్యరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నారుపల్లే జగన్‌మోహన్‌రెడ్డి, సంఘ మహిళ అధ్యక్షురాలు పొన్నపురెడ్డి శకుంతలరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామభూపాల్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికై న కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సంఘ బలోపేతానికి తగిన కృషి చేస్తానన్నారు. జిల్లాలో రెడ్డి మహిళల సంక్షేమం, అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.


