పత్తి రైతుకు ఎక్కువ నష్టం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో
వీడియో కాన్ఫరెన్స్‌లో పిన్నెల్లి
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌తో పిన్నెల్లి మాట్లాడుతూ తమ దగ్గర పత్తికి ఎక్కువ నష్టం జరిగిందని, సగం పంట దెబ్బతిందని తెలిపారు. పెదకూరపాడు, గురజాల, మాచర్లలో పంటలు బాగా దెబ్బతిన్నాయని, పల్నాడు జిల్లాలో రైతులు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో పత్తితో పాటు, మిర్చి ఎక్కువగా సాగు చేస్తారని, రెండింటికీ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఏ మేలూ జరగడం లేదని అన్నారు. ఈ–క్రాప్ లేదని, కాబట్టి, మనం వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయ సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి పట్టణానికి చెందిన చిలకల గురవయ్యబాబు వెంకటలక్ష్మి దంపతులు, చిలకల గురవయ్య, వెంకట పద్మావతి దంపతులు రూ.6,00,116 విరాళంగా అందించారు. పూజలు నిర్వహించిన దాతలు గురువారం ఆలయ ముఖ మండపం నాలుగు వైపులా వచ్చే అత్యంత ప్రధానమైన సాల హారం నిర్మాణానికి విరాళం మొత్తాన్ని వినియోగించాలని కోరారు. పిన్నంశెట్టి వెంకటసుధాకర్, ఝాన్సీలక్ష్మి దంపతులు రూ.51,116 విరాళంగా అందించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, వనమా కృష్ణ, కోవూరు శివశ్రీనుబాబు, గజ వల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.
దాచేపల్లి: నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో మత్స్యకారుల కాలనీకి ప్రమాదం పొంచి ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలోని మత్య్సకారుల కాలనీకి కూతవేటు దూరంలో కృష్ణానదిలోని వరద నీరు గురువారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసి నుంచి కూడా వరద పెరగటంతో ప్రమాదకరంగా పరిస్థితి ఉంది. మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. ఇక్కడ 50కిపైగా కుటుంబాలు చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో రెండు, మూడు సార్లు కృష్ణానదిలో వరద నీరు పెరిగిన ప్రతిసారి మత్స్యకారులు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళుతున్నారు. ఈ ఏడాదిలో మూడవ సారి ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద తీవ్రత పెరిగితే ఇళ్లను ఖాళీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ కె.శ్రీనివాస్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఏఎన్‌యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
పత్తి రైతుకు ఎక్కువ నష్టం
పత్తి రైతుకు ఎక్కువ నష్టం


