వరద బాధితులకు భోజనం అందించరా?
నాదెండ్ల: తుపాను బాఽధితులకు కనీసం భోజనాన్ని కూడా అధికారులు కల్పించలేకపోయారని మాజీ మంత్రి విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరం–చిలకలూరిపేట డొంక రోడ్డులోని యానాదుల కాలనీ కుప్పగంజివాగు వరద ఉద్ధృతితో ముంపునకు గురైంది. దీంతో బాధితులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే, అధికారులు భోజన సౌకర్యం కల్పించలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రజిని పార్టీ నాయకులతో కలిసి బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేవలం పునరావాస కేంద్రంలో ఉన్న వారికే ఆహారం అందించి, ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సరఫరా చేయకపోవడంపై తహసీల్దార్ కుటుంబరావును ఫోన్‌లో సంప్రదించారు. వరద ఉద్ధృతి తగ్గే వరకూ బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వలేటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు ఆదంవలి, తులం సుధాకర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు కాట్రు రమేష్, నాయకులు బొప్పూడి రామారావు, కాటా వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, కుంచాల రాఘవులు, నల్లూరి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, నాగయ్య, శంకరరెడ్డి, అనిశెట్టి కోటేశ్వరరావు, తులం వెంకయ్య, రమేష్ బాబు, అగస్త్య, సాయి, గోపీ, ప్రసన్న, రహంతుల్లా ఉన్నారు.
మాజీ మంత్రి విడదల రజిని
ముంపు ప్రాంతాల్లో పర్యటన
బాధితులకు ఆహారం పంపిణీ


