మోంథాకు ఇద్దరి వృద్ధులు బలి
అద్దంకి/అద్దంకి రూరల్: మొంథా తుపాను కారణంగా అద్దంకి పట్టణంలోని 20వ వార్డుకు చెందిన ఇద్దరు వృద్ధులు మంగళవారం రాత్రి మృతి చెందారు. భారీ వర్షం ధాటికి తీవ్ర చలి తీవ్రత పెరగడంతో రేకనార్ లక్ష్మి (70), వనపర్తి హనుమంతరావు (72) మృతి చెందారు. వీరు స్థానికంగా గుడారాల్లో నివశిస్తూ చిన్నా చితకా పనులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటుంటారు. గిరిజన కుటుంబాలకు చెందిన వీరంతా ఒకే చోట నివాసం ఉంటున్నారు. అద్దంకి వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ గుడారాల్లో, పూరిపాకల్లో నివశించే వారిని అధికారులు పనరావాసాలకు తరలించి వారికి వసతులు కల్పించాలని డింమాండ్ చేశారు. అనంతరం తుపాను ప్రభావానికి పొంగి పొర్లుతున్న గుండ్ల నది ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. మున్సిపల్ కార్మికుల యోగ క్షేమాలను మున్సిపల్ కమిషనర్ రవీంద్రను అడిగి తెలుసుకున్నారు.
మోంథాకు ఇద్దరి వృద్ధులు బలి


