పల్నాడు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కార్తికం.. శివోహం
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,755 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 57,858 క్యూసెక్కులు వదులుతున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 587.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,392 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
కోటిలింగాలలో ప్రత్యేకపూజలు
ఫిరంగిపురం: వేమవరంలోని కోటి లింగాల క్షేత్రంలో భక్తులు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
నరసరావుపేట రూరల్: పవిత్ర కార్తిక మాసం తొలి సోమవారం కోటప్పకొండలో భక్తుల కోలాహలం నెలకొంది. వేలాదిగా భక్తులు త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. అయ్యప్ప, శివయ్య మాలధారులు పెద్దఎత్తున తొలిపూజలో పాల్గొన్నారు. ఓంనమఃశివాయ నామస్మరణతో త్రికూటాద్రి మారుమోగింది. స్వామివారికి పంచామృత ఫల రస సహిత విశేష ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అర్చకులు వైభవంగా జరిపారు. అనంతరం స్వామి వారికి విశేషంగా అలంకరించారు. ఉచిత, శీఘ్ర, ప్రత్యేక, అభిషేక దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఉచిత దర్శనం క్యూలైన్‌లో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు, మహనందీశ్వరుడు, ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మండపాభిషేకంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. సొఫానమార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకుని భక్తులు కొండమీదకు చేరుకున్నారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కొండమీదకు నడిపింది. ట్రాఫిక్ సమస్య తలత్తెకుండా రూరల్ ఎస్‌ఐ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. అన్నదాన మండపంలో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ గావించారు. పలు సంస్థలు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశాయి.
అమరేశ్వరాలయంలో భక్తజన సందోహం
అమరావతి: ప్రపిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి క్షేత్రంలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం మొదటి కార్తిక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కృష్ణా జలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలో దీపారాధనలు చేసి కార్తిక దామోదరునికి విశేష పూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సుమారు 20కు పైగా బస్సులలో పంచారామ క్షేత్ర సందర్శన యాత్రికులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను వివరించారు. ఈవో రేఖ ఉచిత అన్నదానం, ప్రసాదం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


