
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోటి సంతకాల సేకరణ కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరణ
క్రోసూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆయన పార్టీ నాయకులతో కలసి శనివారం ఆవిష్కరించారు. శంకరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు జరిగే కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, బెల్లంకొండ ఎంపీపీ పద్మావెంకటేశ్వరరెడ్డి, అచ్చంపేట మండల అధ్యక్షుడు చిలకా చంద్రయ్య, సీహెచ్‌ఆర్కే సాయిరెడ్డి, ఎంపీపీ పి.కోటయ్య, జెడ్పీటీసీ షేక్ గఫూర్, గార్లపాటి దాసు, వైస్ ఎంపీపీ విప్పల వెంకట్రామిరెడ్డి, అల్లా, కాల్వపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ క్రోసూరు మండల అధ్యక్షుడు వెలది అప్పారావు, సుంకర శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు అనుముల కోటిరెడ్డి, అమరావతి మండల అధ్యక్షుడు భవిరిసెట్టి హనుమంతరావు, ఖాదర్, యార్డు మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాసరెడ్డి, వేజండ్ల రవి, నర్రా వాసుదేవరాయలు, ముస్తఫా, భిక్షమయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.