
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షకు కలెక్టర్ హాజరు
నరసరావుపేట: ఏపీ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, రోగ నిర్ధారణ సేవలు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ ప్రగతి, ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న వాహనాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించిన సమీక్షలో 22ఏ కింద ఉన్న భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.