నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం

Oct 10 2025 6:06 AM | Updated on Oct 10 2025 6:06 AM

నేటి

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపుమేరకు శుక్రవారం నుంచి విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెబుతామని, బోధనేతర పనులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారి జె.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ.. మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనాసమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయేలా ఈ కార్యక్రమాలు పెరిగాయన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అందుకే 10వ తేదీ నుంచి బోధనకే పరిమితం కానున్నామని, నాణ్యమైన విద్యను అందించాలని ఫ్యాప్టో నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపట్టనున్నారని చెప్పారు. మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ చూస్తామన్నారు. మిగతా బోధనేతర పనులను నిలిపి వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు కట్ట నరసింహారావు. ఎన్‌.ఐజాక్‌, దాసరి మరియదాసు, కృష్ణ కిషోర్‌, మంటి సాంబశివరావు, జాన్‌సైదా ఫైజుల్లా, సీహెచ్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి బోధనేతర పనులను బహిష్కరించనున్నట్టు ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎం.మోహనరావు తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల పోరుబాటలో తీనుకున్న నిర్ణయం మేరకు వీటిని బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళకు వినతిపత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా ఇతర బోధనేతర పనులకు సంబంధించి యాప్‌లను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. యాప్‌ల భారంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతూ, బోధనపై దృష్టి పెట్టలేక పోతున్నారని తెలిపారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు ఉస్మాన్‌, చంద్రజిత్‌యాదవ్‌, కె.శ్రీనివాసరెడ్డి, టి.వెంకటేశ్వర్లు, ఈ.ఏమండీ, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు.

క్రోసూరు: రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు శుక్రవారం నుంచి బోధనేతర పనులు బహిష్కంచనున్నట్లు మండలంలోని ఫ్యాప్టో సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి ఎం.గణేష్‌కు వినతిపత్రం అందచేశారు. వినతి అందచేసిన వారిలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఫ్యాప్టో నిర్ణయం

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం 1
1/2

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం 2
2/2

నేటి నుంచి బోధనకు మాత్రమే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement