
పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు
ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు. ఏ మీడియాకు లేని ఆంక్షలు ఒక్క ‘సాక్షి’కే ఎందుకు వర్తిస్తాయో కూటమి సర్కారు జవాబు చెప్పాలి. వాస్తవాలు రాస్తున్నారని ద్వేషమా? నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్నారనే ఆక్రోశంతో చంద్రబాబు, లోకేష్‌లు రగిలిపోతున్నారు. విలేకరుల సమావేశంలో కూటమి కుట్రల గురించి ప్రస్తావిస్తే.. ‘సాక్షి’పై.. ఎడిటర్‌పై కేసులు కట్టడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఆలోచించాలి. నిస్సిగ్గుగా మేం ఏం చేసినా అడిగే వాడు లేడన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేసులు పెట్టి కలాన్ని, పాత్రికేయులను నిలువరించలేరు. ఈ వాస్తవాన్ని కూటమి సర్కారు ఇప్పటికై నా గ్రహించాలి.
– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు