
దేవీ శరన్నవరాత్రుల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఈ నెల 22 నుంచి చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దేవస్థానంలో శనివారం మహోత్సవాల గోడప్రతులను కమిటీ సభ్యులతో కలసి ఆమె ఆవిష్కరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరగుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి పాల్గొన్నారు.
అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ
నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ శనివారం కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు, బాలికల అక్రమ రవాణా నిర్మూలనకు ఎన్జీఓలు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. సీనియర్ సిటిజన్లకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించాలన్నారు. హెచ్‌ఐవీ నిర్మూలనకు, ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణకు ఎన్జీవోలు తగు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ ఎన్జీఓల ప్రతినిధులు హృదయ రాజు, మీరా, డేవిడ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మొదట న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం రాత్రి ఉరుములతో భారీ వర్షం కురిసింది. నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరండల్‌పేటలో పైపులైను కోసం తవ్విన గుంతల పక్కన మట్టి రోడ్డుపైనే ఉండటంతో వర్షం నీటితో చిత్తడిగా మారింది. పలువురు పాదచారులు, వాహన చోదకులు జారిపడి గాయపడ్డారు. డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద వర్షపునీటితో రాపోకపోలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట అండర్‌పాస్ పూర్తిగా నీటి మయం కావడంతో అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మవారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ శనివారం విమర్శించారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు.

దేవీ శరన్నవరాత్రుల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

దేవీ శరన్నవరాత్రుల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

దేవీ శరన్నవరాత్రుల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ