పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట

Sep 21 2025 5:45 AM | Updated on Sep 21 2025 5:45 AM

పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట

పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట

అనధికారికంగా క్లబ్బుల నిర్వహణ భారీగా జేబులు నింపుకొంటున్న నేతలు బార్‌లలోనూ కొనసాగుతున్న క్లబ్బులు వారానికే రూ. కోట్లల్లో టర్నోవర్‌ నాయకుల ధన దాహానికి విస్తరిస్తున్న విష సంస్కృతి కోరిన మద్యం, మాంసాహార వంటకాలు ఏర్పాటు తెలంగాణ నుంచి వచ్చిన వారికి మరిన్ని మర్యాదలు కమీషన్‌ ఇస్తే చాలని కనీసం అటువైపు చూడని పోలీసులు పాలకుల వైఖరితో సామాన్యుల జేబులు గుల్ల

అర్ధరాత్రి వేళ బార్‌లో కూడా...

‘‘రండి బాబు రండి.... అనువైన చోటు.. తిండి, మద్యం బాధ్యత మాదే! కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు... అది కష్టం అనుకుంటే ఫోన్‌ పే, గూగుల్‌ పే అయినా ఓకే. ఇన్నాళ్లు మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు. ఈ ఆనందం కోసం ఇప్పుడు మన రాష్ట్రం దాటవలసిన పనిలేదు. పక్క రాష్ట్రం వారు కూడా మన శిబిరం వద్దకే వస్తున్నారు. రండి.. మీ భద్రతకు మాదే పూచీ. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టడానికి చేతి కింద ఎంతోమంది జాకీలు సిద్ధం. మీరు డబ్బులు గెలుచుకోవాలేగానీ ‘క్వీన్‌ ’ కూడా రెడీ. పైన కింగ్‌ ‘మనోడే’. ఇంకెందుకు ఆలోచిస్తారు... జోకర్‌ పడకపోయినా కూడా షో చెప్పవచ్చు. ట్రిపులెట్‌లా మీ జీవితం వెలిగిపోవచ్చు....’’ అంటూ రాష్ట్రంలో పేకాడే వాళ్లను అధికార కూటమి నేతలు పల్నాడు జిల్లాకు ఆహ్వానిస్తున్నారు.

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన చరిత్ర జూదానిది. పండగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తుల అమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్నో వేల కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయి. ఎంతోమంది ఐపీ పెట్టారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం కాదు.

కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది. కూటమి ప్రజాప్రతినిధుల సహకారంతో నాయకులు మూడు ముక్కలు...ఆరు ఆటలుగా.. పేకాట దందా నిర్వహిస్తున్నారు. యథేచ్ఛగా క్లబ్లులు తెరిచి అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి. దీంతో తెలంగాణ నుంచి భారీ ఎత్తున పేకాటరాయుళ్లు రోజూ వందల మంది పల్నాడు జిల్లాలో ఆడేందుకు వస్తున్నారు. అంతే కాకుండా బందరు, పశ్చిమగోదావరి, ఈస్ట్‌ గోదావరి ప్రాంతాల వారూ ఇక్కడికి వస్తున్నారు.

పలు ప్రాంతాల్లో నిర్వహణ

గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణ శివారు ప్రాంతాల్లో గ్రామాల్లో, మాచర్ల నియోజకవర్గంలోనే కారంపూడి, మాచర్ల పట్టణంలో, వినుకొండ నియోజవర్గంలోని వినుకొండ పట్టణం, ఈపూరు మండలంలో, పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతిలో భారీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ, మిర్యాలగూడెం ప్రాంతాల నుంచి పేకాట ఆడేందుకు పదుల సంఖ్యలో కార్లు వేసుకొని వందల మంది నిత్యం వస్తున్నారు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజవర్గం పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి చెందిన రెస్టారెంట్‌లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెంకి చెందిన వారిని పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. అదే తరహాలో బ్రాహ్మణపల్లి గ్రామంలో కోళ్ల ఫారంలో 36 మందిని పేకాట ఆడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారుగా రూ.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కానీ కూటమి నాయకుల ఒత్తిడితో పోలీసులు వారిని వదిలిపెట్టారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం అమ్మకాలు చేయాలి. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బార్లు ఉంటాయి. గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలలో అర్ధరాత్రి ఐతే చాలు బార్‌లు పేకాట నిలయాలుగా మారాయి. పేకాట టేబుళేకల నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క టేబుల్‌కు రూ. లక్షల్లో ఆట కొనసాగుతోంది. ఈ విషయం పోలీసులకూ తెలుసని, కమీషన్‌ ఇస్తుండటంతో అటువైపు చూడడం లేదని సమాచారం. తెలుగు తమ్ముళ్లు నిత్యం ఎక్కడో ఒక చోట పేకాట ఆడిస్తూ జేబులు నింపుకొటున్నారు. ఆడే వారి జేబులు గుల్లవుతున్నాయి. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పల్నాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement