
చేనేతను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
సత్తెనపల్లి: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ రంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యమ కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. సత్తెనపల్లిలోని పణిదం చేనేత సొసైటీ కాలనీలో శనివారం జరిగిన సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ... అక్టోబర్ 6, 7వ తేదీలలో సత్తెనపల్లిలో సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో పోరాట కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం సుస్సులోవ్, పి ప్రభాకర్, బిట్ర పానకాలు, వలపర్ల చిన్న దిబ్బయ్య, మల్లాల గురవయ్య, మోపర్తి బాబు రాజు, గరికపూడి ఏసురత్నం పాల్గొన్నారు.