
రాష్ట్రస్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థుల ప్రతిభ
బాపట్ల: జాతీయ సోర్డ్స్‌డే సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థులకు బంగారు పతకాలు రావటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. క్రీడాకారులను సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జె.పంగులూరుకు చెందిన సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఖోఖోతోపాటు పలు క్రీడాల్లో విద్యార్థులకు బంగారు పతకాలు కై వసం చేసుకోవటం హర్షనీయమన్నారు. విద్యార్థులు మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు. ఖోఖోలో గోల్డ్ మెడల్, మరో విభాగం వెయిట్ లిఫ్టింగ్ పురుషుల భాగంలో గోల్డ్, సిల్వర్ కై వసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ లాంగ్ జంప్‌లో రెండో స్థానం సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నారు.