
వెయిట్ లిఫ్టర్ సాధియా అల్మస్‌కు గ్రూప్–1 ఉద్యోగం ఇవ్
నరసరావుపేట: మంగళగిరికి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ సాధియా ఆల్మస్‌కు గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. స్వదేశానికి తిరిగిగొచ్చిన సాదియాకు గన్నవరం విమానశ్రాయంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాదల నాగూర్, విజయవాడ సీనియర్ నాయకులు సల్మాన్‌తో కలిసి ఘనంగా సత్కరించామన్నారు. ఆల్మస్ ప్రపంచవ్యక్తంగా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌లో మూడు గోల్డ్‌మెడల్స్‌తో పాటు ఏడు మెడల్స్, కామన్‌వేల్త్ గేమ్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు, ఏషియన్ గేమ్స్‌లో 18 బంగారు పతకాలు, 35 నేషనల్ గేమ్స్‌లో 19 గోల్డ్ మెడల్స్, 24 రాష్ట్ర స్థాయి ఆటల్లో 20 గోల్డ్ మేడల్స్ సాధించిందని పేర్కొన్నారు. సాధియా దేశ విదేశాల్లో మనదేశ గొప్పతనాన్ని చాటి చెప్పడమే కాకుండా మన రాష్ట్రానికి 60 బంగారు పతకాలు సాధించి ప్రపంచపటంలో నిలిపినందున గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ప్రతిభను గుర్తించి డీఎస్‌పీ ఉద్యోగం ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా సాదియా అల్మస్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మౌలాలి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన ఎంఐఎం పట్టణ అధ్యక్షులు మౌలాలి