
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
మేదరమెట్ల: రోడ్డు దాటుతున్న బైకును కారు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. కొరిశపాడు మండలం పరిధిలోని వెంటాపురం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. పి.గుడిపాడు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డి (67) వెంకటాపురం వైపు నుంచి పి.గుడిపాడు వెళ్లేందుకు మోటారు బైకుపై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు.. బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వెంకటేశ్వరరెడ్డికి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలు కాగా ప్రయివేటు వాహనంలో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి