Sep 3 2025 4:31 AM | Updated on Sep 3 2025 12:01 PM
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్ర గ్రహణం కారణంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మూసివేయనున్నట్టు ఈఓ కె.సునీల ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.