
రాష్ట్ర దేవాంగ పురోహిత నూతన అధ్యక్షుడిగా రామారావు
వేటపాలెం: దేవాంగ పురోహిత పరిషత్ నూతన అధ్యక్షుడిగా చల్లా రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలోని సాయిబాబా కల్యాణ మండపంలో దేవాంగ పురోహిత పరిషత్ 4వ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ముందుగా ప్రాంగణంలోని దేవాంగ వంశీయుల కులదేవత రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవబ్రాహ్మణ (దేవాంగ) పండిత అర్చక పురోహిత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కొలువుల మల్లికార్జునరావు, పన్నెం బాలశంకర్, అంబాబత్తుల అండకొండ రాముడు, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మణరావు, సహాయ కార్యదర్శిగా కడి మల్లేశ్వర సిద్ధాంతి, దంతం శివ హనుమంతరావు, కోశాధికారిగా ఉట్ల మహదేవమూర్తి, ఉప కోశాధికారులుగా ఉట్ల ఏకాంబరం, గుంటు దుర్గాప్రసాద్, అధికార ప్రతినిధులుగా బి.ఆనంద నాగప్రసాద్, యువజన విభాగం అధ్యక్షులుగా సజ్జా రాఘవ, సభ్యులుగా బండారు పరవేశ్వరయ్య, బొప్పన మోహనబాబు, బి.విఘ్నేష్, ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో గాయత్రీ పీఠం పునరుద్ధరణ, వేద ఆగమన జ్యోతిష్య పాఠశాల ఏర్పాటు, పురోహితులకు శిక్షణ తరగతులు, నిర్వహణ, జిల్లా కమిటీల ఏర్పాటు సనాతన ధర్మ పరిరక్షణ, తదితర అంశాలపై చర్చించారు.