
● వైభవం.. ఆడి కృత్తిక మహోత్సవం
పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఆడి కృత్తిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ కృత్తిక పురస్కరించుకొని ఆలయ పూజారి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి కావడి మహోత్సవ కార్యక్రమం నాగుల గుడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరై కావడి మహోత్సవం నిర్వహించారు. అనంతరం సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, దంపతులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

● వైభవం.. ఆడి కృత్తిక మహోత్సవం