
మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు
సత్తెనపల్లి: పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
పీ–4 తో పేదరికం నిర్మూలిద్దాం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి
నరసరావుపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానస పుత్రిక పీ–4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్) కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరికం నిర్మూలనలో భాగమవుదామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ – స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ జిల్లా చాప్టర్‌పై మంత్రి గొట్టిపాటి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రామికవేత్తలు పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా నమోదు చేసుకుని ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహాయ సహకారం అందించాలన్నారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక అంతరాలు రూపుమాపడమే లక్ష్యం..
ఆర్థిక అంతరాలను రూపుమాపి పేదరికం లేని సమాజం రూపొందించాలన్నదే పీ–4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీ–4 ఉద్దేశ్యాలను తెలియజేశారు. ఆగష్టు 15 వ తేదీ లోపు బంగారు కుటుంబాలను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ సూరజ్ గనోరే, సీపీఓ శ్రీనివాసమూర్తి, డీఆర్‌ఓ మురళి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్న 44 చట్టాల్లో మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం రూపొందించిన చట్టాలు సైతం రద్దు అయితే కార్మికులు సర్వసం కోల్పోతారని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ సిలార్ మసూద్ పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ప్రదర్శన చేశారు. జీతం పెంపుదల, సెలవులు, రక్షణకోసం జాగ్రత్తలు అడిగే హక్కు కోల్పోతారన్నారు. ఇప్పటికే సమానపనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా ప్రభుత్వాలు అమలుచేయట్లేదన్నారు. కనీస వేతన చట్టం అమలుచేయాలని కోరారు. బుధవారం నిర్వహించే జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అల్లాభక్షు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్ ్స వివరాల సేకరణ
సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ షేక్ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్ బృందం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్‌లు అందర్నీ మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.

మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు