
భూగర్భ జలశాఖ ఏడీఏగా జి.సురేష్
బాపట్ల: భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులుగా జి.సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్.జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సహాయ సంచాలకులుగా పనిచేసిన కె.రామబాలాజీ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పదోన్నతితో బదిలీపై వచ్చిన సురేష్‌కు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
వేమూరు: మద్యం బెల్టు షాపుల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్య షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు. మద్యం ప్రభుత్వం ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని కోరారు. సీఐ రవి, ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

భూగర్భ జలశాఖ ఏడీఏగా జి.సురేష్