నరసరావుపేట: సరైన శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా రవాణాశాఖ అధికారి కె.సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌కు నరసరావుపేట ఆఫీస్ పరిధిలోని అన్ని డ్రైవింగ్ స్కూల్స్ తనిఖీలలో భాగంగా విచ్చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.మధు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శివనాగేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో శుక్రవారం 635 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 464 బస్తాలు వచ్చాయని, కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.13,150, మోడల్ ధర రూ.12,811 పలికినట్టు వివరించారు. కాయలు 171 బస్తాలు వచ్చాయని, కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.12,850, మోడల్ ధర రూ.12,811 పలికినట్టు వెల్లడించారు. మొత్తం 476.250 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
1,23,485 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,13,955 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,485 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,777 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

సరైన శిక్షణతో మెండుగా ఉపాధి అవకాశాలు

1,23,485 బస్తాల మిర్చి విక్రయం