పెదకాకాని: ప్రభుత్వం ఆధ్వర్యంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు అన్నారు. ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లు సంయుక్తంగా నోటి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలన్నారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని సిబార్ దంత వైద్య కళాశాల గత రెండు రోజులుగా జరిగిన జాతీయ దంత వైద్య సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సుకు సిబార్ కళాశాల డీన్ డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ ఓరల్ పథాలజీ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కె.రంగనాథన్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ స్వాగతోపన్యాసం చేశారు. డాక్టర్ టి.కృష్ణబాబు మాట్లాడుతూ సిబార్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో జాతీయ దంత వైద్య సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓరల్ క్యాన్సర్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఓరల్ మెడిసిన్, రేడియాలజీ, ఓరల్ సర్జరీ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు వక్తలుగా విచ్చేసి వారి అనుభవాలను తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు దేశ నలుమూ లల నుంచి 500 వరకు ఓరల్ మెడిసిన్, ఓరల్ పథాలజీ, ఓరల్ సర్జరీ నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నా రు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఓరల్ మెడి సిన్ అండ్ రేడియాలజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ కృష్ణ, కార్యదర్శి డాక్టర్ శివ ప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ అవినాష్ తేజన్వి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సమత, ట్రెజరర్ డాక్టర్ సేతు మంజూష, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు నాయక్, సిబార్ దంత వైద్య కళాశాల డీన్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ
సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ టి.కృష్ణబాబు
సిబార్‌లో జాతీయ దంత వైద్య సదస్సు