
అక్రమ దందా ఓవర్‌లోడ్
ఓవర్ లోడుతో మైనింగ్ రాయిని రవాణా చేస్తున్న టిప్పర్
ఓ పక్కన రక్షణ లేకుండా, మరో పక్కన అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా టిప్పర్ల ద్వారా మైనింగ్ రాయి, మట్టిని అక్రమార్కులు తరలిస్తున్నారు. సామర్థ్యానికి మించి టిప్పర్‌లో మైనింగ్ రాళ్లను వేసి ప్రధాన రహదారిపై అతివేగంగా తరలిస్తున్నారు. క్యాబిన్ కంటే ఎత్తుగా రాళ్లను ఓవర్‌లోడ్ చేసి తరలించటం వలన టిప్పరు బ్రేక్ వేసిన సమయంలో రోడ్డంతా రాళ్లు పడిపోవడమే కాకుండా, వెనుక ఉన్న వాహనాలపై పడి ధ్వంసమవుతున్నాయి. అలాగే బైపాస్‌కు ఇరువైపులా ఉన్న పొలాలు, స్థలాల నుంచి మట్టిని తరలిస్తూ కొందరు అక్రమ దందా చేస్తున్నారు. వీరి ఆగడాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. – పిడుగురాళ్ల